Site icon NTV Telugu

US: మరో డ్రగ్స్ నౌకను పేల్చేసిన అమెరికా.. ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన

Ustrump

Ustrump

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్‌పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక

అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవేశించకుండా అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా సైన్యాన్ని నియమించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెనిజులా నుంచి వచ్చిన రెండు బోట్లను అమెరికా సైన్యం పేల్చేసింది. సెప్టెంబర్ 2న జరిపిన దాడిలో 11 మంది మరణించారు. ట్రెన్ డి అరగువా ముఠా ఈ పడవను నడుపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా ఒక బోటును పేల్చడంతో ముగ్గురు చనిపోయారు.

ఇది కూడా చదవండి: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవపై అమెరికా జరిపిన తాజా దాడిలో ముగ్గురు మరణించారని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘నౌక అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తోందని, అమెరికన్లకు విషం ఇవ్వడానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని నిఘా వర్గాలు నిర్ధారించాయి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈనెలలో 3 ప్రాణాంతక దాడులు జరిగినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే తాజా దాడి ఎక్కడ జరిగిందో మాత్రం కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. వైట్‌హౌస్ కూడా స్పష్టత ఇవ్వలేదు.

అయితే వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురోను పడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని వెనిజులా ఆరోపిస్తోంది. నౌకలో ఉన్నది ఎవరో నిర్ధారించకుండానే ఎలా దాడులు చేస్తారంటూ ఆరోపించింది. బెదిరిపులు, పాలన మార్పు కోసమే అమెరికా ఈ చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది.

 

Exit mobile version