Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!

  • మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు
  • అత్యంత ఆరాధించే నాయకుల్లో ఒకరు అని వ్యాఖ్య
  • బలమైన ప్రతిష్టను కలిగి ఉన్నారని పొగడ్తలు
Trump

Trump

ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ప్రధాని మోడీపై అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ మంచి మిత్రుడని.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని.. ఇద్దరి మధ్య గొప్ప సంబంధం ఉందంటూ పొగడ్తల కురింపించారు. తాజాగా మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా గట్టి నాయకుడని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను అత్యంత ఆరాధించే ప్రపంచ నాయకుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ అన్నారు. ఈ ఇద్దరు నాయకులు తమ తమ దేశాల్లో ప్రభావవంతమైన పాత్రలు పోషిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రతిష్టను కలిగి ఉన్నారని చెప్పారు.

భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్.. గాజా శాంతి మండలిలో సభ్యుడిగా ఉండమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసిన లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘గాజాకు శాశ్వత శాంతిని తీసుకువచ్చే శాంతి మండలిలో చేరమని ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని పంచుకోవడానికి ప్రధానమంత్రి మోడీ గర్వపడుతున్నారు. స్థిరత్వం, శ్రేయస్సును సాధించడానికి ఈ మండలి సమర్థవంతమైన పాలనకు మద్దతు ఇస్తుంది!.’’ అని పేర్కొన్నారు.

×
×
Ad