Indian Navy Submarines: భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ శక్తులను పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే తాజాగా భారత నౌకాదళం మరింత బలపడేందుకు మరో పెద్ద అడుగు వేయబోతోంది. అతి త్వరలో 9 ఆధునిక డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లు నౌకాదళంలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటి ధరలపై చర్చలు జరుగుతుండగా, తర్వాత మంత్రివర్గ భద్రతా కమిటీ (CCS) నుంచి ఆమోదం లభించనుంది. ఈ సబ్‌మెరిన్లు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించబడతాయి. AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా…
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్‌స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.