Site icon NTV Telugu

Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు

Trump9

Trump9

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏ దేశం కెళ్లినా ఒకటే ప్రసంగం చేస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు యుద్ధాలు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. భారత్-పాకిస్థాన్ యుద్దంతో పాటు ఆరు యుద్ధాలు ఆపానంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. తాజాగా యుద్ధాలపై మాట మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలు ఆపానంటూ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నంచగా.. దీనికి బదులిస్తూ.. ‘‘మీకు తెలుసా.. నేను ఇప్పటి వరకు మూడు యుద్ధాలు ఆపా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ దేశాలన్నీ మూడు దశాబ్దాలుగా సంఘర్షణల్లో ఉన్నాయని.. వాటన్నింటినీ తానే ఆపాగలిగానని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం క్లిష్టతరంగా ఉందని.. దాన్ని కూడా ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌‌పై తీవ్ర దుమారం

మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. నాలుగు రోజుల తర్వాత కాల్పుల విరమణతో యుద్ధం ఆగింది. వెంటనే ట్రంప్ ప్రెస్‌మీట్ పెట్టి.. వాణిజ్య బెదిరింపుల కారణంగానే భారత్-పాకిస్థాన్ యుద్ధం ఆపాయని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించింది. ఇరు దేశాల కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని మోడీ తెలిపారు. అయినా కూడా పదే పదే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రతీసారి భారత్ ఖండిస్తూనే వస్తోంది. ఇక ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Exit mobile version