US-Iran: యుద్ధం ముగించే టైమొచ్చింది.. నెతన్యాహుతో ట్రంప్ ఫోన్ సంభాషణ
- యుద్ధం ముగించే టైమొచ్చింది
- నెతన్యాహుతో ట్రంప్ ఫోన్ సంభాషణ
- మారిన నెతన్యాహు వైఖరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో శాంతి విరబూసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే పరిస్థితులున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు మునుపెన్నడూ లేనంతగా చాలా దగ్గరగా ఉన్నాయని ఇప్పటికే ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తాజాగా ట్రంప్ కూడా అదే సంకేతాలిచ్చారు.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కేవలం కొన్ని రోజుల్లోనే ఖరారయ్యే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన టెలిఫోన్ సంభాషణలో ట్రంప్.. ‘‘ఇదే ఒప్పందం.. ఇది అద్భుతమైన ఒప్పందం.. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించే సమయం వచ్చింది.’’ అని స్పష్టం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
Also Read
- Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
నెతన్యాహుకు ట్రంప్ స్పష్టమైన సందేశం
అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ఈ చర్చల్లో నెతన్యాహు కూడా ఒక కీలక విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ముందుకు తీసుకెళ్తున్న ఒప్పందాన్ని తాను అడ్డుకోలేనని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాల్లో ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలను ట్రంప్ తుది ఒప్పందంలో పరిష్కరిస్తారని తనకు నమ్మకం ఉందని నెతన్యాహు చెప్పినట్లు తెలుస్తోంది.
మారిన నెతన్యాహు వైఖరి
ఇప్పటి వరకు ఇరాన్‌పై సైనిక ఒత్తిడి కొనసాగించాలని.. అవసరమైతే పాలనా మార్పు కూడా జరగాలని నెతన్యాహు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు నెతన్యాహుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఈ వారం ప్రారంభంలో ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు చేపట్టేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసిందని.. అయితే ట్రంప్ జోక్యంతో అవి నిలిపివేయబడ్డాయని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌కు ఇంకా అనుమానాలే
శాంతి ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ అధికారుల్లో ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు సడలితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని.. కానీ అణు కార్యక్రమంపై తగిన రాయితీలు ఇవ్వకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి అభివృద్ధి, ప్రాంతీయ మద్దతు బలగాలపై స్పష్టమైన హామీలు అవసరమని చెప్పారు. అవసరమైతే ఇజ్రాయెల్ స్వతంత్రంగా చర్యలు తీసుకునే హక్కును కొనసాగిస్తుందని కూడా పేర్కొన్నారు.
ఒప్పందంలో ఏముంది?
అమెరికా పరిపాలనకు చెందిన ఓ సీనియర్ అధికారి సమాచారం ప్రకారం.. ఈ అవగాహన ఒప్పందం కుదిరే అవకాశాలు ప్రస్తుతం 80 నుంచి 85 శాతం వరకు ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంలో:
60 రోజుల కాల్పుల విరమణ
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం
ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం
దశలవారీగా ఆంక్షల సడలింపు
అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు
అయితే ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ఇరాన్‌కు ఆర్థిక ప్రయోజనాలు లభించవని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. యురేనియం నిల్వలను అప్పగించడం, అణు కేంద్రాలను నిర్వీర్యం చేయడం వంటి షరతులను ఇరాన్ అమలు చేసిన తర్వాతే ఆంక్షల సడలింపు వంటి ప్రయోజనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
శాంతికి మార్గం?
ఈ ఒప్పందం కేవలం అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలకే పరిమితం కాకుండా ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలు, ఇతర మధ్యప్రాచ్య దేశాల మధ్య విస్తృత స్థాయి శాంతి ప్రక్రియకు మార్గం సుగమం చేయవచ్చని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య తుది అంగీకారం కుదిరితే గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మధ్యప్రాచ్య సంక్షోభానికి కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
US-Iran: యుద్ధం ముగించే టైమొచ్చింది.. నెతన్యాహుతో ట్రంప్ ఫోన్ సంభాషణ
-
IAF Plane Crash: “అస్సాం గగనతలంలో ఘోర క్రాష్.. నేలకొరిగిన ఐదుగురు దేశ వీర జవానులు!”
-
Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్‌తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!