భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు.
ఇది కూడా చదవండి: Lisbon: లిస్బన్‌లో ఎలక్ట్రిక్ స్ట్రీట్‌కార్ ప్రమాదం.. 20 మంది మృతి
వైట్‌హౌస్‌లో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకితో ట్రంప్ భేటీ అయ్యారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. రష్యాపై చర్యలేవీ అంటూ ప్రశ్నించారు. దీంతో ట్రంప్ రుసరుసలాడారు. చర్య లేదని మీకెలా తెలుసు? రష్యాతో సంబంధాలు పెట్టుకున్న భారత్, చైనాపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీని కారణంగా రష్యాకు వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయని చెప్పారు. ఇది చర్య కాదంటారా? ఇక తాను రెండు లేదా మూడో దశ ఇంకా చేయలేదని.. అది కూడా త్వరలోనే ఉంటుందని ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
ఇది కూడా చదవండి: Delhi Floods: డేంజర్‌లో యమునా నది.. మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు
రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే భారత్‌కు పెద్ద సమస్యలు ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో కూడా మరింత జరుగుతుందని.. దాని గురించి ఇంకేమీ చెప్పొద్దన్నారు. మాస్కోపై ద్వితీయ ఆంక్షలు విధించబోతున్నారా? అని అడిగినప్పుడు.. ఇప్పటికే భారత్ విషయయంలో అలానే చేశానని.. ఇతర విషయాల్లో కూడా అలానే చేస్తామని చెప్పుకొచ్చారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 సుంకం అమల్లోకి వచ్చింది. తాజాగా మాట్లాడుతూ.. మరిన్ని దశల్లో ఆంక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక ట్రంప్ సుంకాలపై భారత్ ధీటుగానే సమాధానం ఇచ్చింది. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ వెల్లడించారు. అన్నదాతలే తమకు ముఖ్యమని.. ఏ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరు దేశాల అధ్యక్షులతో మంతనాలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో రష్యాతో సంబంధాలు పెట్టున్న దేశాలపై భారీగా సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. అన్నట్టుగానే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. చైనాపై విధించినా 90 రోజులు గడువు విధించారు. భారత్‌పై మాత్రం అమలు చేసేశారు.
