Site icon NTV Telugu

Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట

Trump2

Trump2

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం అనేక మార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చల కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని.. ఇందుకు మూడో వ్యక్తి ప్రమేయం ఏ మాత్రం లేదని భారత్ అనేక మార్లు మీడియా సముఖంగా ప్రకటించింది. కానీ తాజాగా శుక్రవారం రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ఒక ప్రైవేట్ విందులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనట్లుగా వెల్లడించారు. వాణిజ్యం ద్వారానే ఇరు దేశాల మధ్య సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాలుగు రోజులు యుద్ధంలో ఐదు జెట్‌లు కూలిపోయాయని చెప్పారు. ఎక్కడా? ఏంటి? అనేది మాత్రం వెల్లడించలేదు.

ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్‌హౌస్‌కు వచ్చి నోబెల్ శాంతి బహుమతికి తనకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. భారత్-పాకిస్థాన్ రెండు దేశాలు అణు దేశాలే.. మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకే యుద్ధాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: ఊహాగానాలు వద్దు.. మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ

నోబెల్ శాంతి బహుమతి పొందాలని ట్రంప్ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఏం జరిగినా దానికి క్రెడిట్ ట్రంప్ తీసుకుంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య, హమాస్-ఇజ్రాయెల్ మధ్య, రష్యా-ఉక్రెయిన్ మధ్య, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించినట్లుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఇక ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి ఇప్పటికే పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు మద్దతు తెలిపాయి.

ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.

Exit mobile version