Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • 48 గంటల తర్వాత విధ్వంసమే..
  • హార్ముజ్ తెరవకుంటే దాడులు చేస్తాం..
  • ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
Donald Trump San Francisco

Donald Trump San Francisco

Donald Trump: మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో తీవ్ర యుద్ధం జరుగుతోంది. రెండు పక్షాలు కూడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టింది.

Read Also: Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్‌పై ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ మరో 48 గంటలతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. ‘‘ ఒప్పందానికి అంగీకరించి, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇప్పటికే సమయం ఇచ్చాము, కానీ ఇప్పుడు కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ గడువు దాటితే, అమెరికా ఇరాన్‌పై తీవ్రమైన దెబ్బ కొడుతుంది. గ్లోరీ టూ గాడ్.’’ అని రాశారు. మార్చి 26న హార్ముజ్ జలసంధిని ఒపెన్ చేసి, ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ 10 రోజుల డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు దీనికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు రోజుల తర్వాత అమెరికా ఎలాంటి దాడులకు దిగుతుందనే ఉత్కంఠ నెలకొంది.