Mrunal Thakur: లవ్ లైఫ్‌పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: తన లైవ్ లైఫ్‌పై ఓపెన్ అయిన సినీ నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డెకాయిట్’ సినిమా విడుదలకు ముందు జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె తన లవ్ లైఫ్‌పై ఓపెన్‌గా మాట్లాడారు. ప్రేమలో అన్ని హద్దులు దాటే సమయం ఇంకా రాలేదని, కానీ అది త్వరలోనే రావొచ్చని చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
Read Also: Dunkin: భారత్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం.. కారణం ఇదే..
Also Read
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రేమ కోసం ఎంతవరకు వెళ్లగలరనే ప్రశ్నకు స్పందించిన మృణాల్ ఠాకూర్, “ప్రేమలో అన్ని హద్దులు దాటడం నా జీవితంలో ఇంకా జరగలేదు.. కానీ, అది రాబోతోంది. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతాను” అని తెలిపారు. ఇక, అదే ప్రశ్నకు స్పందించిన హీరో అడివి శేష్ తన గత ప్రేమ అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు తన ప్రేమ కోసం జేబులో డబ్బు లేకపోయినా యూరప్ నుంచి కెనడా వరకు ప్రయాణించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అనుభవించిన కష్టాలు, కొత్త పరిచయాలు తన జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోయాయని చెప్పారు.
ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్ గతంలో కూడా ప్రేమ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తొలిచూపు ప్రేమను తాను నమ్ముతానని, అయితే ఆడవాళ్లు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం భావోద్వేగాలను మరిచిపోలేరని అన్నారు. మరోవైపు, ఇటీవల మృణాల్ ఠాకూర్, సౌత్ స్టార్ ధనుష్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆమె ఇప్పటికే ఖండించింది. మొత్తానికి, తన లవ్ లైఫ్‌పై మృణాల్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసాయి. ఇక ఆమె చెప్పినట్లే “హద్దులు దాటే ప్రేమ” ఎప్పుడు వస్తుందో.. హద్దులు దాటించే ఆ ప్రేమికుడు ఎవరో చూడాలి మరి..
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!