Site icon NTV Telugu

Trump-Colombia: కొలంబియాపై మారిన తీరు.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్

Trump3

Trump3

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా, మెక్సికోకు హెచ్చరికలు జారీ చేశారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని.. పెట్రో కొకైన్ అమ్ముతోందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా మాదిరిగానే కొలంబియా ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. దీనికి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందిస్తూ.. ‘మీకోసమే ఎదురుచూస్తున్నా’ అంటూ సవాల్ విసిరారు. అమెరికా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎదురుదాడి చేశారు.

తాజాగా కొలంబియా విషయంలో ట్రంప్ స్వరం మారింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మంచి ఫోన్ సంభాషణ జరిగిందని సోషల్ మీడియాలో తెలియజేశారు. డ్రగ్స్, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే గుస్తావో పెట్రోతో భేటీ కాబోతున్నట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

‘‘కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మాట్లాడటం గొప్ప గౌరవం. ఆయన మాదకద్రవ్యాలు, ఇతర విభేదాల పరిస్థితిని వివరించడానికి ఫోన్ చేశారు.’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేశారు. ‘‘నేను అతని పిలుపును.. స్వరాన్ని అభినందిస్తున్నాను. సమీప భవిష్యత్తులో అతనిని కలవడానికి ఎదురు చూస్తున్నాను.’’ సమావేశం వైట్ హౌస్‌లో జరుగుతుందని ట్రంప్ రాసుకొచ్చారు.

Exit mobile version