H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- H-1B ఉద్యోగులకు షాకిచ్చిన ట్రంప్..
- అమెరికన్లను తొలగించి, H-1B ఉద్యోగుల తీసుకునే కంపెనీలపై అదనపు పరిశీలన..
- H-1B వీసాల్లో సింహభాగం భారతీయులే..
- ట్రంప్ నిర్ణయంతో భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి H-1B వీసా విధానంపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, H-1B వీసాలకు అప్లై చేసుకునే కంపెనీల దరఖాస్తుల్ని మరింత కఠినంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇదే సమయంలో ఈ తరహా వీసాలపై 1,00,000 అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనల్ని మరో ఏడాది పొడగించారు. ఈ నిబంధనలు 2027 సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతాయి. అయితే, ఈ ఫీజుపై న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి.
ఈ రెండు నిర్ణయాలు భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాలు పొందుతున్న విదేశాల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. 2024 లెక్కల ప్రకారం.. ఈ వీసాలకు అప్లై చేసుకున్న వారిలో 71 శాతం భారతీయులదే కావడం గమనార్హం.
Also Read
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
H-1B ఆర్డర్లో ఏముంది.?
ట్రంప్ కొత్త ఆదేశాల ప్రకారం.. అమెరికా విదేశాంగ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలు H-1B వీసాలపై మరింత సమన్వయంతో పనిచేయాలి. H-1B వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్న కంపెనీలు గతేడాది అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిందా? లేదా? లేదంటే భవిష్యత్తులో అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయా? అనే దానిపై అధికారులు దృష్టిపెట్టనున్నారు.
అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించి, H-1B వీసాలతో ఉద్యోగుల్ని నియమించుకుంటున్నారని, తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ట్రంప్ వాదన. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, వ్యయాలు తగ్గించుకోవడానికి H-1B వీసాలను సాధనంగా వాడుతున్నారని, వీటిని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. అయితే, అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిన ప్రతీ కంపెనీ H-1B ఉద్యోగుల్ని నియమించుకోకుండా నిషేధం లేదు. దీంతో పాటు గతంలో దాఖలైన లేబర్ కండీషన్ అప్లికేషన్లను కూడా సమీక్షించాలని అమెరికా కార్మిక శాఖకు ఆదేశాలు అందాయి. 30 రోజుల్లో సమీక్ష ప్రారంభించాలని ఆదేశంలో పేర్కొన్నారు.
భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్:
ట్రంప్ తీరు వల్ల భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. H-1B వీసా నియమాలు భారతీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీలు, ఇదే స్థాయిలో H-1B ఉద్యోగులను తీసుకోవడంపై పరిశీలన మరింత కఠినం అవుతుంది. వేతనాలు, ఉద్యోగ బాధ్యతలు, విదేశీ ఉద్యోగ అర్హతలు, అమెరికన్ ఉద్యోగుల తొలగింపు వంటి వాటిపై మరిన్ని తనిఖీలు జరిగే అవకాశం ఉంది.
లక్ష డాలర్ల ఫీజు పొడగింపు..
H-1B వీసాలకు 1,00,000 డాలర్లు చెల్లించే నిబంధనల్ని ట్రంప్ మరోసారి పొడగించారు. ఇది ప్రతీ H-1B ఉద్యోగి నుంచి వసూలు చేసే మొత్తం కాదు కానీ, విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఇందులో ఉన్నాయి. H-1B వీసాలకు స్పాన్సర్ చేసే కంపెనీ లేదా యజమాని ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి సమయంలో కంపెనీలు భారతీయుల్ని లేదా వేరే విదేశీ ఉద్యోగుల్ని తీసుకోవాలా? లేక స్థానిక ఉద్యోగులతోనే నడిపించాలా? అనే దానిపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో ఈ ఫీజు అమలులోకి వచ్చిన తర్వాత పెద్ద ఐటీ స్టాఫింగ్, ఔట్సోర్సింగ సంస్థల H-1B రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయి.
తాజావార్తలు
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!