Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

  • ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం..
  • ఒప్పందం కుదరకుంటే అంతా నాశనం..
  • మరోసారి ఇరాన్‌ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు..
Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాస్టర్డ్స్ అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు. హార్ముజ్ ఓపెన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్‌కు హెచ్చరికలు పంపారు. ట్రంప్ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో మరోసారి ఆయన ఇరాన్‌ను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.

Read Also: SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘సోమవారం నాటికి ఒక ఒప్పందం అవకాశం ఉందని, ఒప్పందం కుదుర్చుకోకపోతే అన్నింటిని పేల్చేసి, చమురును స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నాను’’ అని ట్రంప్ అన్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష మంజూరు చేయబడిందని ఆయన అన్నారు. చర్చలు విఫలమైతే ఇరాన్ చమురు వనరుల్ని స్వాధీనం చేసుకోవడంతో సహా తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇరాన్‌లో కుర్దిష్ మార్గాల ద్వారా నిరసనకారులకు అమెరికా ఆయుధాలను పంపిందని, అయితే అవి వారికి చేరి ఉండకపోవచ్చని సంచలన వ్యాక్యలు చేశారు. కుర్దిష్ సమూహాలు ఆ ఆయుధాలను తమ వద్దే ఉంచుకోని ఉండొచ్చని అన్నారు.

హార్ముజ్ జలసంధిని సముద్ర రవాణాకు మూసివేస్తే, ఈ మంగళవారం ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేస్తామని బెదిరించిన గంటల వ్యవధిలోనే తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ వేదికగా ఆయన ఇరాన్‌ను బూతులు తిడుతూ, హార్ముజ్‌ను తెరవకుంటే నరకంలో జీవిస్తారని ట్రంప్ హెచ్చరించారు. మంగళవారం ఇరాన్‌లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజు జరుగుతాయని అన్నారు.