Trump: చివరి నిమిషంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 2 వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: గత కొద్ది రోజులు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాయి. తాను ఇరాన్‌పై విధించిన డెడ్‌లైన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అంతకు ముందు రోజు 48 గంటల డెడ్‌లైన్ విధించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గడం ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే.. తాజాగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ మరో షరతు విధించారు. ఇరాన్ తన క్షిపణి దాడులను ఆపి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే ఈ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ చేరుకుందని, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
“పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో నేను చర్చలు జరిపాను. ఇరాన్‌పై ఈ రాత్రికి జరగాల్సిన భారీ సైనిక దాడులను నిలిపివేయాలని వారు నన్ను కోరారు. ఇందుకు ప్రతిస్పందనగా, ఇరాన్ తన ‘హోర్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) తక్షణమే, సురక్షితంగా, పూర్తిగా తెరిచేందుకు అంగీకరించాలనే షరతుతో రెండు వారాల పాటు ఇరాన్‌పై బాంబు దాడులు, ఇతర దాడులను నిలిపివేయడానికి నేను అంగీకరిస్తున్నాను. ఇది ఇరువైపులా వర్తించే యుద్ధ విరమణ! మేము ఇప్పటికే మా సైనిక లక్ష్యాలన్నింటినీ పూర్తి చేశాము. ఇరాన్‌తో శాశ్వత శాంతి కోసం, అలాగే మధ్యప్రాచ్యంలో ప్రశాంతత కోసం ఒక ఖచ్చితమైన ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాము. ఇరాన్ నుంచి మాకు 10 అంశాలతో కూడిన ప్రతిపాదన అందింది. చర్చలకు అది ఒక మంచి ప్రాతిపదిక అని నమ్ముతున్నాము. గతంలో వివాదస్పదంగా ఉన్న దాదాపు అన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది. ఈ రెండు వారాల గడువు ఆ ఒప్పందానికి తుది రూపు ఇచ్చి, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అమెరికా అధ్యక్షుడిగా, అలాగే మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధిగా.. చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి దగ్గరగా రావడం నాకెంతో గౌరవంగా అనిపిస్తోంది. ధన్యవాదాలు!” అని ట్రంప్ తన ట్రూత్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..