Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- ‘నన్ను శత్రువుగా మార్చడం రాజకీయాలకు చాలా చెడ్డది!’
- కెనడా ప్రధాని కార్నీపై ట్రంప్ ఫైర్
- రెండు దేశాల ముదురుతోన్న వాణిజ్య యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ‘‘శత్రువు’’గా చిత్రీకరించడం కెనడా రాజకీయాలకు చాలా చెడ్డ పరిణామంగా మారుతుందని హెచ్చరించారు.
గురువారం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్టు చేశారు. ‘‘ప్రధాని కార్నీ వంటి కెనడా రాజకీయ నాయకులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘శత్రువు’గా చూపించడం మంచిదే. అయితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తర్వాత అది కెనడా రాజకీయాలకు చాలా చెడ్డదిగా మారుతుంది. కెనడా రాజకీయ నాయకుడికి ఇప్పటివరకు ఎదురైన వాటన్నింటికంటే ఇది దారుణంగా ఉంటుంది. వేచి చూడండి’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
కార్నీ ఘాటు కౌంటర్
మరోవైపు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధికారులు ‘‘సీరియస్‌గా వ్యవహరించడం ప్రారంభించాలి’’ అని సూచించారు.
ట్రంప్ విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు కెనడాను అవమానించేలా వ్యాఖ్యలు చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. ‘‘అలాంటి వ్యాఖ్యలు వారి పదవికి తగినవి కావు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు ది గార్డియన్ పేర్కొంది. ‘‘అమెరికన్లు మీమ్స్ చేయడం, ఎగతాళి చేయడం, కఠినంగా కనిపించేందుకు ప్రయత్నించడం ఆపి.. వాణిజ్యంపై చర్చలు జరపడం విషయంలో సీరియస్‌గా వ్యవహరించడం ప్రారంభించినప్పుడు మనం కూడా చర్చలు జరపవచ్చు’’ అని కార్నీ అన్నారు.
లేక్ ఒంటారియో పేరుపైనా వివాదం
ఇదిలా ఉంటే.. గత వారం ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. లేక్ ఒంటారియో పేరును ‘‘లేక్ అమెరికా’’గా మార్చాలని అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకించింది.
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల భారీ నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడి అత్యంత సీనియర్ వాణిజ్య చర్చల ప్రతినిధి మాత్రం కొట్టిపారేశారు. ఈ వివాదం ‘‘మన కంటే కెనడాకే ఎక్కువ అత్యవసర సమస్య’’ అని వ్యాఖ్యానించారు.
50 శాతం సుంకాలతో మొదలైన వివాదం
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య చర్చలు విఫలమైన వారం రోజులకుపైగా తర్వాత ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెనడా నుంచి దిగుమతి అయ్యే సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. అమెరికాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన కెనడా.. దీనికి ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 8 నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు కెనడా ప్రకటించింది.
- Tags
- Donald Trump
- Mark Carney
- trump
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!