Israel Strikes Qatar: అరబ్ దేశాల్లో అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఖతార్ ఉంటుంది. అలాంటి ఖతార్‌పై మంగళవారం ఇజ్రాయిల్ దాడులు చేసింది. రాజధాని దోహాలో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూర్ నేతలే టార్గెట్‌గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే, ఇదంతా అమెరికాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కానీ, ఇజ్రాయిల్ దాడి చేసే విషయాన్ని, అమెరికా ఖతార్‌కు ఆలస్యంగా తెలియజేసిందని తెలుస్తోంది. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయని ఇజ్రాయిల్ చెబుతోంది. ‘‘ దురదృష్టవశాత్తు, దాడిని ఆపడానికి చాలా ఆలస్యం అయింది’’ అని ట్రంప్ సమాధాని చెప్పారు. ఇజ్రాయిల్ దాడి గురించి తమకు తెలియజేసిందని చెప్పారు.
ఇదే జరిగితే, అమెరికా, ట్రంప్ కలిసి ఇజ్రాయిల్‌ని దారుణంగా మోసం చేసినట్లే. వైట్ హౌజ్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ దాడి గురించి తెలిజేసిందని చెప్పారు. అయితే, ఖతార్‌కు అమెరికా ఇచ్చి సమాచారం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం జరిగినట్లు అనిపిస్తోంది. దోహాలో దాడి ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత అమెరికా నుంచి కాల్ వచ్చినట్లు ఖతార్ చెప్పింది. పేలుళ్ల శబ్ధం సమయంలో ఒక అమెరికన్ అధికారి నుంచి ఫోన్ వచ్చిందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ ట్వీట్ చేశారు.
దీనిని బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ కనిపిస్తోంది. హమాస్ ఒప్పందం కుదుర్చుకోవాలనే హెచ్చరికతో, దోహాలో హమాస్ పొలిటికల్ బ్యూరో సమావేశం జరుగుతున్న సమయంలో ఇజ్రాయిల్ దాడి చేసింది. అయితే, ఈ దాడిపై ఖతార్ ఆగ్రహంతో స్పందించింది. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
Read Also: Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
ఇదేం ద్రోహం..
భారతదేశం లాగే, ఇతర మిత్ర దేశాలతో ట్రంప్ వ్యహరిస్తున్న తీరును ఖతార్ కూడా రుచి చూసింది. నాలుగు నెలల క్రితం ఖతార్ పర్యటన సందర్భంగా 400 మిలియన్ డాలర్ల విలువైన ‘‘ప్లయింగ్ ప్యాలెస్’’గా పిలువబడే లగ్జరీ బోయింగ్ 747-8 జెట్‌ను ఖతాన్, ట్రంప్‌కి బహుమతిగా ఇచ్చింది. ఈ పర్యటనలో ఖతార్ నుంచి 243.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పొందారు. ఇక మిడిల్ ఈస్ట్‌లో ఖతార్‌లోనే అమెరికాకు అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉంది.
నాటోయేతర ప్రధాని మిత్రదేశంగా ఖతార్‌కు పేరుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేలాది మంది అమెరికన్ పౌరులను తరలించడంలో కూడా ఖతార్ హెల్ప్ చేసింది. ఇదే కాకుండా హమాస్, తాలిబాన్ వంటి ఉగ్ర సంస్థలతో చర్చించడానికి అమెరికాకు ఖతార్ మధ్యవర్తిగా ఉంది. ఇరాన్ తో కూడా ఖతార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో డీల్ చేసే విషయంలో ఖతార్ ఉపయోగపడుతోంది. అయినా కూడా, ఇజ్రాయిల్ దాడి గురించి ఖతార్‌కు ముందస్తు సమచారం ఇవ్వలేదని తెలుస్తోంది.