Trump travel Ban: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే 43 దేశాలు ఇవే.. మూడు జాబితాలు రెడీ..
- 43 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్..!
- జాబితాలో పాక్, నార్త్ కొరియా, రష్యా..
- మూడు జాబితాలుగా దేశాల వర్గీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump travel Ban: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. ట్రంప్ తన సుంకాలతో పెద్ద వివాదానికి తలుపులు తెరిచారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలను విధించారు. మరోవైపు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపారు. తాజాగా, కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదు.
మొత్తం 43 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
1) రెడ్ లిస్ట్: రెడ్ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్‌లతో వంటి 11 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించకుండా నిషేధించబడుతారు.
2) ఆరెంజ్ లిస్ట్: ఈ లిస్టులో ఉండే దేశాలు పూర్తిగా ప్రయాణ ఆంక్షలు ఎదుర్కోవు. అయితే, కొన్ని ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటాయి. ఈ సమూహంలో బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెర్రా లియోన్, దక్షిణ సూడాన్, తుర్క్మెనిస్తాన్ వంటి 10 దేశాలు ఉన్నాయి.
3) ఎల్లో లిస్ట్: ఈ జాబితాలో మొత్తం 22 దేశాలు ఉండే అవకాశం ఉంది. అమెరికా గుర్తించిన లోపాలను సవరించుకోవడానికి 60 రోజుల గడువు ఇవ్వబడుతుంది. ఈ దేశాలు యూఎస్ షరతులను పాటించకపోతే, మిగిలిన రెండు జాబితాల్లోకి ఈ దేశాలు చేరుతాయి.
ఎల్లో లిస్టులో అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరూన్, కేప్ వెర్డే, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కాంగో, డొమినికా, ఈక్వటోరియల్ గినియా, గాంబియా, లైబీరియా, మలావి, మాలి, మౌరిటానియా, సెయింట్. కిట్స్ మరియు నెవిస్, సెయింట్. లూసియా, సావో టోమ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!