ఆమె వయసు 20 ఏళ్లు. ఆమె వృత్తి మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అయితే ఇందులో గొప్పేమీ ఉందనుకుంటున్నారా?, తొందరపడొద్దు. ఆమె ఏడాదికి సంపాదించే ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె ఆదాయం ముందు ప్రముఖ స్టార్లు కూడా దిగదుడుపే అని చెప్పకతప్పదు.
సోఫీ రెయిన్ (20) ప్రముఖ అడల్ట్ స్టార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కేవలం డిజిటల్ కంటెంట్ పోస్టు చేసి దాదాపు 17 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించింది. ఈ విధంగా ఆమె ఏడాదికి రూ.360 కోట్లు సంపాదిస్తోంది. ఓన్లీ ఫ్యాన్స్ నుంచి $43.4 మిలియన్ ఆదాయాన్ని సంపాదించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో తన ఆదాయానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించింది. ఇంత ఆదాయాన్ని ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏడాదికి ఇంత ఆదాయం సంపాదిస్తుందా? అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ జేసన్ టాటమ్‌తో పోలుస్తున్నారు. ఇతడి ఆదాయం కేవలం $35 మిలియన్లే ఉంది. సూపర్ స్టార్ కంటే ఎక్కువగా సోఫీ రెయినే ఎక్కువగా సంపాదిస్తుంది.
సోఫీ రెయిన్ ఫ్లోరిడాలోని శ్రామిక కుటుంబం నుంచి వచ్చింది. జీవితంలో ఆర్థికంగా చాలా కష్టాలను ఎదుర్కొంది. 17 ఏళ్ల వయసులో వెయిట్రెస్‌గా పని చేసింది. కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న సాలరీలతో పని చేసి పోషించేది. 2023, ఏప్రిల్‌లో సోదరి సియోర్రాతో కలిసి ఓన్లీ ఫ్యాన్స్‌లో డిజిటల్ కంటెంట్ పోస్ట్ చేయడం ప్రారంభించింది. అలా ఒక్కసారిగా దశ మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ప్రారంభంలోనే 11 మిలియన్ల అభిమానులను సంపాదించింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా ఆదాయం సంపాదించే వ్యక్తిలో ఒకరిగా మారిపోయింది. సంపాదనలో తన తల్లిదండ్రులు చేసిన రూ.12.67 లక్షల రుణాన్ని తీర్చేసింది. అంతేకాకుండా కొత్త కారు కూడా కొనుగోలు చేసి ఇచ్చింది. సోఫీ ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది. రూ.6.33 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. నెలకు రూ.8.45 లక్షల ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. ఆదాయంలో 70 శాతం పొదుపు చేస్తూ.. మిగతా ధనాన్ని విలాసాలకు ఖర్చుచేస్తోంది. అయితే సోఫీ ఆదాయంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
thankful for one year on here 🫶🏻 pic.twitter.com/Rq8KU5ju7n
— Sophie Rain (@sophieraiin) November 28, 2024
Sophie Rain reveals she’s making 4 million dollars a month. That’s 48 million PER YEAR… pic.twitter.com/9go7VgClBc
— internet hall of fame (@InternetH0F) November 28, 2024