Taliban: ఇళ్లల్లోని వంట గదులకి కిటికీలు పెట్టొద్దు.. తాలిబన్లు కొత్త నిబంధన!
- మహిళల హక్కులను కాలరాస్తున్న అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు ప్రభుత్వం..
- ఇళ్లల్లోని వంట గదులకి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు..
- ఇప్పటికే జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై తాలిబన్ సర్కార్ నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ఇఅఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటి వారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది.
Read Also: 2024 Mollywood : సత్తా చాటిన స్టార్ హీరోలు.. ఫ్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
అయితే, వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల దగ్గరకు వచ్చిన మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలి అని తాలిబర్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని తక్షణమే మూసివేయాలి అని అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి.. కొత్త రూల్స్ అమలును పర్యవేక్షించనున్నారు.
ఇక, మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛను తాలిబన్ ప్రభుత్వం హరిస్తుంది. ఇప్పటికే జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యకు బాలికల్ని దూరం చేయడంతో పాటు పలు రంగాల్లో మహిళ ఉద్యోగాలను పరిమితం చేస్తున్నారు. అలాగే, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు బట్టలు ధరించాలని కఠిన ఆంక్షలు విధించారు. తాలిబన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను గతంలో ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. జన జీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసేందుకు తాలిబన్లు ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొనింది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!