Afghanistan: మహిళలకు తాలిబన్లు షాక్.. ఇది మహా దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban Government Gives Shock To Women Officials: గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళల హక్కుల్ని కాలరాస్తూ వస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. పురుషాధిక్య విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. మహిళా ఉద్యోగులపై కొరడా ఝుళపించారు. వారిని ఆఫీసుకు రావొద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా బంధువుల్లోని మగాళ్లని పంపాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది.
‘‘నాకు రీసెంట్గా తాలిబన్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. అంత పని మీరు చేయలేరు కాబట్టి, మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపండి’ అని చెప్పారు’’ ఆ మహిళ తెలిపింది. అంతేకాదు.. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి తమ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తన పదవిని సైతం తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ. 60 వేలు ఉన్న తన జీతాన్ని ఏకంగా రూ. 12 వేలుకి తగ్గించారని, ఇదేంటని ప్రశ్నిస్తే పై అధికారి దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇచ్చిన జీతంతో పని చేస్తే ఉండమని, లేకపోతే వెళ్లిపోవచ్చని తనని బెదిరించారంది. 15 ఏళ్లుగా తాను ఆర్థిక శాఖలో పని చేస్తున్నానని, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశానని, కానీ తన చదువుకు తగ్గ హోదా దక్కట్లేదని ఆ మహిళా ఉద్యోగి మొరపెట్టుకుంది.
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
కాగా.. మహిళలపై తాలిబన్లు ప్రదర్శించిన తీరుని అంతర్జాతీయ సమాజం ఇదివరకే తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై విధించిన ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ అంచనా వేశారు. ఆఫ్గాన్ తిరిగి పేదరికంలోకి వెళ్లిపోయిందని.. ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..