Pakistan: పాకిస్తాన్ పరువు పాయె.. ఎంబసీని మూసేసిన స్వీడన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశంలో స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసేసింది. వీసాలు, ఇతర దౌత్యసంబంధాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది.
Read Also: GT vs PBKS: పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
ఇస్లామాబాద్‌లోని ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా, స్వీడన్ రాయబార కార్యాలయం సందర్శకుల కోసం మూసివేయబడింది. మైగ్రేషన్ విభాగం ప్రస్తుతం ఎలాంటి అభ్యర్థనలను నిర్వహించదు అని రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఒక నోటీసులో పేర్కొంది. రాయబార కార్యాలయం ఎప్పడు పున:ప్రారంభిస్తామనే విషయాలను ప్రస్తుతం చెప్పలేమని నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇది స్వీడన్ లో ఇటీవల జరిగిన ఖురాన్ ను తగులపెట్టిన ఘటనతో ఈ మూసివేతకు సంబంధం ఉన్నట్లు సమాచారం. జనవరి 21న ఓ స్వీడన్ వ్యక్తి స్టాక్‌హోమ్‌లోని టర్కిష్ రాయబార కార్యాలయం ముందు ఖురాన్ కాపీని తగులబెట్టాడు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల నుండి ఖండించారు.
దీన్ని పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ తో పాటు మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. పవిత్ర ఖురాన్ ను తగలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 బిలియన్ ముస్లింల మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీశారని ట్వీట్ చేశారు. ఈ నేేపథ్యంలో స్వీడన్ తన మిషన్ ను పాకిస్తాన్ మూసేశారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం చైనా తన పౌరులకు కూడా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భద్రతతో పాటు ప్రైవేట్ భద్రతను కల్పించుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!