NTV Telugu Site icon

Srilanka Economic Crisis: సంక్షోభ నివారణకు అన్ని ప్రయత్నాలు చేశా: గొటబాయ రాజపక్స

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa

శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు.

‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని.. రాజపక్సే లేఖలో పేర్కొన్నారు. తన కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక దుర్వినియోగం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని అన్నారు. కోవిడ్ వల్ల శ్రీలంకకు విదేశీ పర్యాటకులు రాకపోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాని నా వ్యక్తిగత నమ్మకం.. ఇందులో భాగంగానే అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించా’’ అని రాజీనామా లేఖలో గొటబయ రాజపక్స పేర్కొన్నాడు.

Read Also: Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి పార్లమెంట్ చర్చించేందుకు సమావేశం అయింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించేందుకు మరోసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కానుంది. బుధవారం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా బలగాలు పార్లమెంట్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అయితే రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో ఆందోళనలు కొంతమేర చల్లారాయి. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరగడం.. ఇంధన సంక్షోభంతో గత మార్చి నుంచి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. గొటబయ రాజపక్స రాజీనామాతో ప్రజల ఆందోళనలు సద్దుమణిగాయి.