North Korea: ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు.. స్వయంగా రంగంలోకి దిగిన కిమ్
- ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు
- స్వయంగా రంగంలోకి దిగిన కిమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఇక కిమ్.. స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రచారం కావడంతో వైరల్‌గా మారాయి.

Also Read
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
ఇదిలా ఉంటే దాయాది దేశం దక్షిణ కొరియా.. విపత్కర పరిస్థితుల్లో.. ఉత్తర కొరియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తరకొరియాకు మానవతా సాయం అందిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని వెల్లడించింది. ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది. అయితే దీనిపై కిమ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇది కూడా చదవండి: Mohammed Deif: 7 సార్లు తప్పించుకున్నాడు.. చివరకు ఇజ్రాయిల్ టార్గెట్ చేసి లేపేసింది..
ఇక భారీ వర్షాల కారణంగా బుధవారం 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టంపై కిమ్ సర్కారు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం..
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!