అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గజగజలాడిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి కుండపోతగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇక గడ్డ కట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 15 కోట్ల మందికి పైగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇంకోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. మరోవైపు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దాదాపు 7 వేల విమానాలు రద్దయ్యాయి. ఇక రహదారులు మూసుకుపోవడంతో నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది. దీంతో కిరాణా స్టోర్లు అన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో ఆహార వస్తువులు దొరకకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

ట్రాకర్ ఫ్లైట్వేర్ ప్రకారం.. టెక్సాస్ నుంచి రాకపోకలు జరిగించే విమానాలతో సహా 2,700 కి పైగా వారాంతపు విమానాలు రద్దైనట్లుగా పేర్కొంది. టెక్సాస్ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మైఖేల్ వెబ్బర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మంచు పేరుకుపోవడం కారణంగాపెద్ద ప్రమాదంగా ఉంటుందని హెచ్చరించారు. మంచు చెట్లను పేరుకుపోయి బరువుగా మార్చగలదని. ఉదాహరణకు విద్యుత్ లైన్లను కూల్చివేసి అంతరాయాలను కలిగిస్తోందని చెప్పారు.
Shelves emptied in Mamdani NYC by panic buyers bracing for historic Arctic storm pic.twitter.com/9cPCphInK4
— RT (@RT_com) January 24, 2026