Pakistan: సిక్కు మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. 9 నెలల తర్వాత రక్షించిన పోలీసులు..
- పాకిస్తాన్‌లో మైనారిటీలకు రక్షణ ఏది.?
- తొమ్మిది నెలల క్రితం సిక్కు మహిళ కిడ్నాప్..
- ఇద్దరు నిందితుల అత్యాచారం..
- ఎట్టకేలకు రక్షించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్‌లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. అయితే, ఆ దేశంలో మాత్రం హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ మైనారిటీపై దాడులు, మైనారిటీ మహిళలు, బాలికల కిడ్నాప్‌లు, అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందూ బాలికలు, యువతను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుకి చెందిన సిక్కు మహిళను తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేశారు. 40 ఏళ్ల మహిళతో పాటు ఆమె మైనర్ కుమారుడిని ఇద్దరు నిందితులు అపహరించారు. తాజాగా ఆమెను, కుమారుడిని రక్షించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. లాహోర్‌కి 130 కి.మీ దూరంలోని పంజాబ్‌లోని ఫైపలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
Read Also: Bengal Governor: “నిందితుడిని ఉరితీసి, తర్వాత విచారించాలా.?” మమతా బెనర్జీపై గవర్నర్ ఫైర్..
బెండర్-బేస్డ్ వయొలెన్స్ యూనిట్ హెడ్(ఫైసలాబాద్) ఏఎస్పీ జైనాబ్ ఖలీద్ ప్రకారం.. నన్కానా సాహిబ్‌లో నివసిస్తున్న సిక్కు మహిళను ఫైసలాబాద్‌కి చెందిన ఖుర్రం షాజాద్, కిజార్ షాజాద్ అనే ఇద్దరు సోదరులు కిడ్నాప్ చేశారు. 9 నెలలుగా ఆమెపై పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడాకులు తీసుకున్న మహిళని నన్కానా సాహిబ్‌కి చెందిన సైమా అనే స్నేహితురాలు నిందితుడు ఖుర్రంకి పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో ఆమె తన మైనర్ కుమారుడిని ఫైసలాబాద్ నుంచి నాన్కానా సాహిబ్‌లోని తన సోదరి ఇంట్లో దిపాలని నిందితుడు ఖుర్రంని కోరింది. అయితే, బాలుడిని బందీగా పట్టుకుని అతను సోహైలాబాద్‌లోని తన ఇంటికి రావాలని మహిళని బలవంతం చేశాడు. అక్కడ నిందితులిద్దరూ మహిళను బంధించి అత్యాచారం చేశారు. తొమ్మిది నెలల నుంచి ఇద్దరు ఆమెపై పదే పదే అత్యాచారాని ఒడిగట్టినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఆమె బంధువు ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 14న ఖుర్రం ఇంటిపై దాడి చేసి ఆమెను, ఆమె కొడుకుని రక్షించారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారాన్ని ప్రతిఘటించిన సమయంలో తనపై దాడి చేసినట్లు సిక్కు మహిళ చెప్పింది.
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!