Sheikh Hasina: “బంగ్లాదేశ్ జైలు, ఉరిశిక్షలకు స్థలంగా మారింది”.. యూనస్‌పై విరుచుకుపడిన హసీనా..
- మహ్మద్ యూనస్ ఒక హంతక ఫాసిస్ట్.
- . బంగ్లాదేశ్ రక్తంతో తడిచిపోయింది..
- నన్ను కుట్రతో పదవి నుంచి తొలగించారు..
- తొలిసారి బహిరంగ సభలో షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను విడిచి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై ఆమె విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడిగా పేర్కొన్నారు. ఆయన పాలనలో అక్రమ, హింసాత్మక పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఫారిన్ కారస్పాండెంట్స్ క్లబ్లో జరిగిన ‘సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్’ కార్యక్రమంలో హసీనా వీడియో సందేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అవామీలీగ్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, బంగ్లాదేశ్క వలసదారులు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాలపై హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jammu kashmir: పాక్ ఉగ్రవాది ఖతం.. భద్రతా బలగాలకు కీలక విజయం..
Also Read
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.22 తగ్గించిన పాక్..
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
ఈ రోజు బంగ్లాదేశ్ అగాధం అంచున ఉందని, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. దేశం పెద్ద జైలు, ఉరిశిక్షలకు స్థలంగా, మరణ లోయగా మారిందని ఆమె ఆరోపించారు. ఆగస్టు 5, 2024న తనను అధికారంలో నుంచి తొలగించడాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ భయంకరమైన యుగంలోకి ప్రవేశించిందని, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రవాసజీవితం గుడుపుతోందని ఆమె అన్నారు. యూనస్ హత్యకాండ ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారీ, డబ్బు అక్రమ రవాణాదారు, అధికార దాహంతో దేశద్రోహం చేసిన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
యూనస్ పాలనలో మానవహక్కలు కారరాయబడ్డాయని, మీడియా స్వేచ్ఛను అణిచవేశారని, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని హసీనా అన్నారు. దేశవ్యాప్తంగా మూకదాడులు, దోపిడీలు, బెదిరింపులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు శాంతిగా ఉన్న దేశాన్ని ఇప్పుడు రక్తంతో తడిచిన నేలగా మారిందని ఆమె అన్నారు. తీవ్రవాద, మతతత్వ శక్తులు, విదేశాలు దేశాన్ని నాశనం చేశాయని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్‌లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
-
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..