Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!

Shehbazsharif

Shehbazsharif

Shehbaz Sharif:  జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా భారత్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని కార్యాలయంతో పాటు ఆయన వ్యక్తిగతంగా జమ్మూ కాశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అక్టోబర్ 27, 2026ను ‘‘జమ్మూ కాశ్మీర్ బ్లాక్ డే’’గా పాటిస్తోంది. ఈ సందర్భంగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

పాక్ పీఎంఓ ప్రకటనలో.. ‘‘79 సంవత్సరాల క్రితం, భారత సైన్యం శ్రీనగర్‌లో అడుగుపెట్టింది. ఇది జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక విషాద అధ్యాయానికి నాంది పలికింది, దాని గాఢమైన నీడ ఇప్పటికీ ఆ ప్రాంతంపై ఆవరించి ఉంది. అప్పటి నుండి, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు వారి ‘స్వీయ-నిర్ణయాధికారం’ నిరాకరించబడింది, ఈ హక్కును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంబంధిత తీర్మానాలలో గుర్తించింది.’’ అని ట్వీట్ చేశారు.

షెహబాజ్ షరీఫ్ ఎక్స్ అకౌంట్‌లో.. ‘‘భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు అపారమైన కష్టాలు, బాధలు, అణచివేతను ఎదుర్కొంటున్నారు అఅయినప్పటికీ తమ ప్రాథమిక హక్కులను సాధించాలనే వారి ధైర్యం, స్థైర్యం, సంకల్పం చెక్కుచెదరలేదు. తరతరాలుగా వారి త్యాగాలు స్వేచ్ఛ, గౌరవం, న్యాయం పట్ల వారికున్న ప్రగాఢ నిబద్ధతకు శక్తివంతమైన నిదర్శనం’’ అని అన్నారు. కాశ్మీరీ ప్రజల చట్టబద్ధమైన రాజకీయ గొంతును భారత్ అణచివేస్తున్నారని, వారి ఆకాంక్షలను నొక్కుతున్నారని ఆరోపించారు.

డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజున, భారత బలగాలు శ్రీనగర్‌లో అడుగుపెట్టాయి, జమ్మూ కాశ్మీర్‌పై ఒక సుదీర్ఘ చీకటి అలుముకున్నాయని అబద్ధాలనున ప్రచారం చేశారు. కాశ్మీర్‌కు పాకిస్తాన్ ఎప్పుడూ అండగా ఉంటుందని జమ్మూ కాశ్మీర్ వివాదం పరిష్కారమయ్యే వరకు దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం అసాధ్యమని చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్తాన్ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును కొనసాగిస్తుందని చెప్పారు.