Terrifying incident: ప్రియుడి కోసం 5000 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు అవయవాల కోసం హత్యకు గురైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
She Flew to Peru for Love—and Was Allegedly Killed for Her Organs: ఆన్లైన్లో పరిచయం అయిన అబ్బాయి కోసం ఏకంగా 5000 కిలోమీటర్లు ప్రయాణించింది. తాను ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉంటానని అనుకుంది.. కానీ చివరకు అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఓ మహిళ. ప్రేమించిన వ్యక్తే అత్యంత ఘోరంగా మహిళను హతమార్చాడు. ఈ విషాదకర ఘటన లాటిన్ అమెరికా దేశం అయిన పెరూలో చోటు చేసుకుంది. మహిళ అవయవాల కోసం అత్యంత దారుణంగా శరీరాన్ని కోసేసి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని పెరు సముద్ర తీరంలో నవంబర్ 9న కనుక్కున్నారు.
మెక్సికోకు చెందిన 51 యువతి జూలై నెలఖరులో బ్లాంకా అరెల్లానో విహారయాత్ర కోసం పెరూలోని లిమాకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పింది. ఆమె గత కొన్ని నెలలుగా పెరూ దేశానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి జువాన్ పాబ్లో జీసస్ విల్లాఫుర్టేను ఆన్లైన్లో పరిచయాన్ని కొనసాగిస్తోంది. అయితే అతనితో లవ్ లో పడిన బ్లాంకా, అతడిని కలుసుకునేందుకు మెక్సికో నుంచి పెరూ వెళ్లింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఉండే బీచ్ సిటీ ఆఫ్ హువాచోను వెళ్తున్నట్లు ఆమె కుటుంబానికి చివరిసారిగా నవంబర్ 7న చెప్పింది. అదే ఆమె చివరి కాల్.
Also Read
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
Read Also: Amit Shah: చరిత్రను తిరిగరాయండి.. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా..?
ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా బ్లాంకా నుంచి ఎలాంటి సమాధానం లేదు. చివరి సారిగా నవంబర్ 7న తన అత్తతో మాట్లాడినట్లు బ్లాంకా మేనకోడులు కార్లా అరెల్లానో వెల్లడించింది. ఆ సమయంలో ఆమె ప్రేమలో ఉందని.. ఆమె సంబంధం బాగానే ఉందని బ్లాంకా, కార్లాతో చెప్పినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే.. తన అత్త ఆచూకీ రెండు వారాలుగా తెలియకపోవడంతో ట్విట్టర్ ద్వారా ఆమెను గుర్తించాలని మేన కోడలు కార్లా అరెల్లానో కోరింది. ఆమె ట్వీట్ తో పోలీస్ విచారణ ప్రారంభం అయింది. ‘‘ నా అత్త, బ్లాంకా ఓలివియా అరెల్లానో గుటిరేజ్, నవంబర్ 7 నుంచి పెరూలో అదృశ్యమయ్యారు, ఆమె మెక్సికోకు చెందినది.. ఆమె ప్రాణాల కోసం భయపడుతున్నాం’’ ఆమెను వెతకాల్సిందిగా ట్విట్టర్ ద్వారా కోరారు.
కాగా, పెరూ సముద్ర తీరంలో అత్యంత భయానక స్థితిలో బ్లాంకా అరెల్లానో శవం లభించింది. స్థానిక మత్య్సకారుడు ముందుగా ఆమె శవాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆమె శరీరం దాదాపుగా ఛిద్రం అయి, శరీరంలోని అవయవాలు మాయం అయ్యాయి. శరీర అవయవాల కోసమే ఆమెను లవరే అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 17 జువాన్ పాబ్లోను పోలీసుల అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!