యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. హోం కార్యదర్శిగా తొలిసారి ఒక ముస్లిం మహిళ నియమితులయ్యారు. షబానా మహమూద్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్, పోలీసింగ్, జాతీయ భద్రతను షబానా మహమూద్ నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. దీంతో షబానా మహమూద్ కొత్త హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఏంజెలా రేనర్ రాజీనామా తర్వాత య్వెట్ కూపర్ స్థానంలో షబానా మహమూద్ నియమితులయ్యారు. షబానా మహమూద్ క్లిష్ట సమయంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొంటారనేది సవాలుగా మారింది.
షబానా మహమూద్ ఎవరు?
షబానా మహమూద్ తల్లిదండ్రులది పాకిస్థాన్. యూకేకు తల్లిదండ్రలు వలస వచ్చారు. 1980లో షబానా మహమూద్ బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. బాల్యం అంతా సౌదీ అరేబియాలోనే గడిపారు. ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యషించారు. ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ కేసుల్లో ప్రత్యేకత కలిగిన న్యాయవాదిగా అర్హత సాధించారు. 2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూకేలో మొట్టమొదటి మహిళా ముస్లిం ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. అనేక కీలక షాడో పాత్రలను కూడా నిర్వహించారు. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించిన తర్వాత.. న్యాయ కార్యదర్శిగా, లార్డ్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. జైల్లో రద్దీని తగ్గించడానికి.. అలాగే కోర్టు బకాయిలను పరిష్కరించడానికి ముందస్తు ఖైదీల విడుదల పథకాన్ని కూడా పెట్టారు. ఇక షబానా మహమూద్ నియామకాన్ని పలువురు స్వాగతించారు.
The Rt Hon Shabana Mahmood MP @ShabanaMahmood has been appointed as Secretary of State for the Home Department @UKHomeOffice. pic.twitter.com/HUKQh8wnDT
— UK Prime Minister (@10DowningStreet) September 5, 2025