Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..
- కెనడా పీఎం ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ..
- ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలుపు..
- కంచుకోటను కోల్పోయిన లిబరల్ పార్టీ..
- సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది. గత మూడు దశాబ్ధాలుగా లిబరల్ పార్టీకి ఈ స్థానంలో ఓటమి ఎదురైంది. ఉప ఎన్నికల్లో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత ఇప్పుడే తొలిసారి ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన లెస్టీ చర్చి పరాజయం పాలయ్యారు. న్యూ డెమెక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచాడు. చర్చ్‌పై పాల్ 590 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Read Also: Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
అధికార లిబరల్ పార్టీపై కన్జర్వేటివ్ పార్టీ ప్రజాతీర్పును తెలియజేస్తుందని కెనడియన్ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఓటమి నేపథ్యంలో వెంటనే ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ పియర్ పొయిలీవ్రా డిమాండ్ చేశారు. వరసగా 10 ఎన్నికల్లో ఈ స్థానంలో లిబరల్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. అయితే, ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కరోలిన్ బెన్నెట్ డెన్మార్ రాయబారిగా నియామకం కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఓటమి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని అక్కడి మీడియా చెప్పింది. ద్రవ్యోల్భణం, జీవన వ్యయం సంక్షోభం, హౌసింగ్ క్రైసిస్, పెరుగుతున్న వలసలు ఓటర్లకు అధికార పార్టీపై అసంతృప్తి నెలకొంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!