CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
- భారత్ సమ్మిట్‌పై విపక్షాల విమర్శలు
- వీసాల రద్దు వెనుక కుట్ర ఉందని అనుమానం
- కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై సీఎం విమర్శలు
- ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను పారిశ్రామికంగా అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశీ ప్రతినిధుల వీసాల రద్దు వెనుక కుట్ర?
హైదరాబాద్ వేదికగా నవంబర్ 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి సుమారు 1,000 మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. ఇందులో వివిధ దేశాల ఎంపీలు, మంత్రులు, ఆర్థిక నిపుణులు, పర్యావరణ వేత్తలు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. అయితే, వీసాలు మంజూరైన తర్వాత కూడా చివరి నిమిషంలో కొంతమంది విదేశీ ప్రతినిధుల వీసాలను రద్దు చేయడం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ సిద్ధాంతం ప్రకారం.. తెలంగాణ వాతావరణాన్ని, ఇక్కడి మౌలిక సదుపాయాలను విదేశీ ప్రతినిధులు ప్రత్యక్షంగా చూస్తే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, అందుకే కొందరు కావాలనే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
- Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
- CP Mahesh Bhagwat: "అదే నా మొదటి ప్రాధాన్యత".. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
కిషన్ రెడ్డి, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు
తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ నేత ఎన్. రామచంద్ర రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తే ఆ ప్రతిపక్షాలకు ఎందుకు కంటిమీద కునుకు కరువవుతోందని ప్రశ్నించారు. భారత్ సమ్మిట్‌ను ‘భారత్ వ్యతిరేక సమ్మిట్’గా చిత్రీకరించడం, ప్రభుత్వ సొమ్ము వృథా చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే అంశాలను కూడా రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కు ముందు సన్నాహకంగానే ఈ భారత్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కంట్రీ-వైజ్ కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో ముంబై, అహ్మదాబాద్‌లోనూ ప్రచార కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం, స్పష్టమైన పారిశ్రామిక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ సదస్సు ఉద్దేశమన్నారు.
క్లైమేట్ చేంజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, పెట్టుబడులపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి చర్చలు ఎంతో అవసరమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసి.. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అగ్రపథంలో నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?