NTV Telugu Site icon

Pakistan: విధ్వంసానికి ఆర్ఎస్ఎస్, బీజేపీనే కారణమట.. పాకిస్తాన్ లో వింతవాదన..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రోడ్లను బ్లాక్ చేయడంతో పాటు పాకిస్తార్ రేడియో కేంద్రం, ఆర్మీ కొంటోన్మెంట్లను ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగా ఆరుగురు మరణించారు. 1000పైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది.

Read Also: Largest Stadiums: దేశంలోని టాప్-10 అతిపెద్ద క్రికెట్ మైదానాలు

ఇదిలా ఉంటే పాకిస్తాన్ కొంతమంది వింతవాదనలు చేస్తున్నారు. భారతదేశం నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులు పాకిస్తాన్ లో విధ్వంసాలకు పాల్పడుతున్నారంటూ వింత వాదన ఎత్తుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన ఆందోళనలను ఉద్దేశిస్తూ.. పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్ ఈ ఆరోపణలు చేశారు. విధ్వంసం, దహనాల వెనక ఉన్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులే అని తరార్ బుధవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు.

కొంతమంది వ్యక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధం కలిగి ఉన్నారని, నిన్నటి సంఘటనల తర్వాత భారతదేశంలో వేడుకలు జరిగాయని, ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబరాలు చేసుకున్నాయని, స్వీట్లు పంచుకున్నారని, నిన్న జరిగిన విధ్వంసం అంతా ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకే అని తరార్ అవివేకం అయిన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సులను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితిని ఆర్మీనే సమీక్షిస్తోంది.