Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Send Rockets To Elon Musks Message As Israel Iran Conflict Heats Up

Elon Musk: “రాకెట్ల ఉన్నవి అంతరిక్షంలోకి పంపేందుకు”.. ఇరాన్-ఇజ్రాయిల్‌ వివాదంపై మస్క్

Published Date :April 19, 2024 , 11:25 am
By venugopal reddy
Elon Musk: “రాకెట్ల ఉన్నవి అంతరిక్షంలోకి పంపేందుకు”.. ఇరాన్-ఇజ్రాయిల్‌ వివాదంపై మస్క్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Elon Musk: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. గత శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పైకి డ్రోన్లను పంపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని కూల్చేసినట్లు ఇరాన్ చెబుతోంది. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ పరిణామాలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇప్పటికే గాజా యుద్ధంతో రగులుతున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఒక రాకెట్‌ని ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. ‘‘మనం రాకెట్‌ని ఒకరిపై ఒకరు వేసుకోవడానికి కాదు, నక్షత్రాలకు పంపాలి’’ అని అన్నారు. రాకెట్లు ఉన్నది అంతరిక్షానికి పంపేందుకు కానీ, ఒకరిపై ఒకరు ప్రయోగించుకోవడానికి కాదని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Chhattisgarh Encounter: స్వస్థలానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

ఈ రోజు ఇరాన్‌‌పైకి ఇజ్రాయిల్ క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వెలువడిన గంటలో ఆయన ఈ ట్వీట్ చేశారు. గతంలో ఆయన హమాస్ దాడిలో దెబ్బతిన్న ఇజ్రాయిల్‌లోకి పలు కిబ్బట్జ్‌ని సందర్శించి ఇజ్రాయిల్‌కి సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ గాజాలో చేసిన విధ్వంసాన్ని చూడాలంటూ హమాస్ ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించింది.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడి వెనక ఇరాన్ ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. హమాస్ దాడిలో 1200 మంది మరణించారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 30000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు.

ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసి, ఇరాన్‌కి చెందిన ఇద్దరు టాప్ జనరల్స్‌ని, మరికొందరు అధికారుల్ని హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్ తీవ్ర ప్రతీకారంలో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయిల్‌పైకి వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను పంపింది. అయితే, ఇజ్రాయిల్‌కి ఉన్న ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వంటి పటిష్ట ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉండటంలో ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డుకుని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరాన్‌పై ఇజ్రాయిల్ డ్రోన్లను పంపిందనే వార్తలు రావడంతో మరోసారి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరిగింది.

We should send rockets not at each other, but rather to the stars pic.twitter.com/h4apedUrsU

— Elon Musk (@elonmusk) April 19, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Elon Musk
  • Gaza war
  • Hamas
  • Iran
  • Israel

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions