Russia: గడువు ప్రకారమే ‘ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ‘ఎస్-400’ సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. S-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్ణయించుకున్న గడువుకు అనుగుణంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘రష్యా డైజెస్ట్’ అనే మేగజీన్‌కు ఆయన ముందుమాట రాశారు. పశ్చిమ దేశాలకు చెందిన అనేక కంపెనీలు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ దేశ విపణిలో భారత వ్యాపారాలకు అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినట్లయిందని అందులో పేర్కొన్నారు.
భారత్‌కు ఎస్–400 సరఫరా విషయంలో.. తమపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఏదీ ఉండదని రష్యా ఇటీవలే స్పష్టం చేసింది. ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐదు యూనిట్ల కొనుగోలు కోసం భారత్ 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5.43 బిలియన్ డాలర్లు. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ భారత్ లెక్కచేయలేదు. ఒప్పందంపై తమ మాట వినకుండా ముందుకు వెళితే భారత్‌పై ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్ ట్రంఫ్ ప్రభుత్వం హెచ్చరించింది.వాటిలో తొలి యూనిట్ అందజేత ప్రక్రియ గత ఏడాది డిసెంబరులో, రెండో రెజిమెంట్ సరఫరా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది.
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్‌ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..