Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ఓ రష్యన్ జంట చేసిన సాహసం సంచలనంగా మారింది. ప్రపంచ శాంతికి పిలుపునిస్తూ భవనం శిఖరంపై బ్యానర్ ప్రదర్శించిన ఈ జంట, అనంతరం అక్కడే నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సాహసం చివరకు వారి అరెస్టుతో ముగిసింది.
1,454 అడుగుల ఎత్తైన భవనం
ఏంజెలా నికోలావు, వాన్యా బీర్కస్ అనే రష్యన్ జంట ముఖాలకు మాస్క్‌లు ధరించి, నల్లటి దుస్తుల్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు చెందిన ప్రజలకు ప్రవేశం లేని ట్రాన్స్మిషన్ టవర్‌పైకి ఎక్కారు. మొత్తం 1,454 అడుగుల ఎత్తులో ఉన్న యాంటెన్నా పైభాగంలో నిలబడి తమ సాహసాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా పంచుకున్నారు.
Also Read
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
- Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
- Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
ప్రపంచ శాంతికి పిలుపు
యాంటెన్నా పైభాగంలోకి చేరుకున్న అనంతరం వారు పెద్ద నల్లటి బ్యానర్‌ను విప్పారు. అందులో “ప్రేమ శక్తి అధికార ప్రేమను జయించినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుంది” అనే సందేశం రాసి ఉంది. ఈ సూక్తిని చాలామంది ప్రముఖ గిటారిస్ట్ జిమి హెండ్రిక్స్దిగా భావించినప్పటికీ, వాస్తవానికి ఇది 19వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ రాజకీయ నాయకుడు విలియం గ్లాడ్‌స్టోన్ చెప్పిన మాటలకు స్వల్ప మార్పుతో రూపొందించిన సందేశమని తెలుస్తోంది.
శిఖరంపైనే ప్రేమ ప్రతిపాదన
మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశీలనా వేదికపై ఉన్న సందర్శకులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా వీక్షించారు. కొంతసేపటి తర్వాత ఇద్దరూ యాంటెన్నా దిగువన ఉన్న ఒక ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నారు. అక్కడ వాన్యా ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని ఏంజెలాకు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఆమె వెంటనే అంగీకరించడంతో ఇద్దరూ ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం ఏంజెలా తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగించి నిశ్చితార్థాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్
ఈ సాహసానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఏంజెలా నికోలావు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనను తాను “భయం, స్వేచ్ఛ, వ్యక్తిత్వాన్ని అన్వేషించే నియో ఆర్టిస్ట్”గా ఆమె పరిచయం చేసుకుంటుంది. ఈ జంట ఇప్పటికే ప్రపంచంలోని పలు ఎత్తైన నిర్మాణాలపైకి ఎక్కింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జి, మలేషియాలోని ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన భవనం మెర్డెకా 118పై కూడా వీరు సాహసాలు చేశారు. వీరి జీవితాల ఆధారంగా రూపొందిన 2024 నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “Skywalkers: A Love Story” కూడా మంచి గుర్తింపు పొందింది.
చివరికి అరెస్ట్
ఈ జంట నిషేధిత ప్రాంతంలోకి ఎలా ప్రవేశించిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిశీలనా వేదికను ఖాళీ చేయించారు. భద్రతా చర్యల్లో భాగంగా సమీప రహదారులను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు పోలీసు హెలికాప్టర్ కూడా భవనం చుట్టూ గస్తీ వేసింది. తర్వాత న్యూయార్క్ పోలీసులు ఇద్దరినీ ఎలాంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిపై పలు అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రాణాంతక సాహసమని నిపుణుల హెచ్చరిక
భవనం ట్రాన్స్మిషన్ టవర్‌పై ప్రత్యక్ష టెలివిజన్, రేడియో ప్రసారాలకు సంబంధించిన పరికరాలు ఉండటంతో పాటు భారీ విద్యుత్ శక్తి ప్రవహిస్తుందని నిపుణులు హెచ్చరించారు. మాజీ సీఎబీఎస్ న్యూయార్క్ చీఫ్ ఇంజనీర్ జాన్ క్లియరీ మాట్లాడుతూ, అక్కడ పనిచేసే సాంకేతిక నిపుణులు ప్రత్యేక శిక్షణ పొందుతారని, చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఈ జంట ఎలాంటి భద్రతా హార్నెస్‌లు లేకుండానే టవర్‌పై సంచరించడం అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
కుమార్తెకు తండ్రి మద్దతు
ఏంజెలా నికోలావు తండ్రి, రష్యన్ సర్కస్ కళాకారుడు దిమిత్రి నికోలావు తన కుమార్తె చర్యలను సమర్థించారు. “అమెరికా సహా ఏ దేశంలోనైనా పైకప్పుపైకి ఎక్కడం సాధారణ విషయమే. అందులో తప్పేమీ లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. కుమార్తె గురించి ఆందోళన లేదా అని అడగగా, “నేను కూడా పైకప్పులపైకి ఎక్కుతాను. మరి ఎందుకు భయపడాలి?” అని సమాధానమిచ్చారు.
ఇదే మొదటిసారి కాదు
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పైకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. 2023లో నటుడు, సంగీతకారుడు జారెడ్ లెటో అధికారిక అనుమతులతో భవనాన్ని అధిరోహించాడు. అంతకుముందు 1994లో “ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్”గా పేరొందిన అలైన్ రాబర్ట్ చేతులు, కాళ్ల సహాయంతో భవనాన్ని ఎక్కి అనంతరం అరెస్టయ్యాడు.
Proposal atop the Empire State Building? pic.twitter.com/ngV2b5eaZr
— CSPAN (@cspan) July 1, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!