Russia-Ukraine War: రష్యా మిస్సైల్ అటాక్..21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై భీకరదాడిని కొనసాగిస్తోంది రష్యా. యుద్ధం ప్రారంభం అయి నాలుగు నెలలు గడిచినా.. రష్యా తన దాడిని ఆపడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలు మసిదిబ్బను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా దాడులను ఎక్కువ చేసింది. క్రమంగా ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతోంది.
తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 21 మంది మరణించారు. బ్లాక్ సీ ఒడెస్సా పోర్టుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్ పట్టణం సెర్గివ్కాపై రష్యా దాడి చేసింది. మిస్సైల్ స్ట్రైక్ వల్ల ఓ అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా దాడిలో 12 ఏళ్ల బాలుడితో పాటు 20 మంది మరణించారు. రష్యా దాడిని ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభివర్ణించాడు.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఫిబ్రవరి నెలలో మొదలైన యుద్ధం ఉక్రెయిన్ ను సర్వనాశనం చేస్తోంది. బలమైన రష్యా ముందు కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్ తెగించి పోరాడుతోంది. అమెరికా, నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి కొన్ని నెలులు ప్రయత్నించినా రష్యాకు సాధ్యపడలేదు. దీంతో చేసేందేం లేక తూర్పు ప్రాంతం నుంచి దాడులు మొదలుపెట్టింది ఉక్రెయిన్.
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ లోని చారిత్రక సంపద దెబ్బతింటోంది. కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు రష్యా దాడులతో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే వీధుల్లో పడి ఉన్న శవాల వల్ల కలరా వ్యాపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం బాంబులు, క్షిపణులతో నిండి ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది.
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!