Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు
- త్రైపాక్షిక చర్చలను పునఃప్రారంభించే అవకాశాన్ని తోసిపుచ్చని క్రెమ్లిన్
- పుతిన్, జెలెన్స్కీలతో భేటీ అయిన ట్రంప్ రాయబారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine Peace Talks: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ సోమవారం వెల్లడించింది. అయితే చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇటీవల మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, అనంతరం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు.
పుతిన్‌తో విట్కాఫ్, కుష్నర్ మూడు గంటలపాటు సమావేశమయ్యారు. దీని తర్వాత జెలెన్స్కీతో చర్చించారు. ఉక్రెయిన్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని అమెరికా ప్రతినిధులు చెప్పారు. అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలను రష్యా ప్రశంసించింది. ట్రంప్‌కు శాంతి విషయంలో ఉన్న నిబద్ధతను తాము అభినందిస్తున్నామని క్రెమ్లిన్ పేర్కొంది. అమెరికా రాయబారుల ప్రయత్నాలను రష్యా గౌరవంగా చూస్తోందని తెలిపింది. పుతిన్, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణలు జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ పేర్కొంది. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య శాంతి అంత సులభంగా నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు భాగాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ విషయంలో రష్యా డిమాండ్లు, ఉక్రెయిన్ వైఖరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి.
Also Read
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
- Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
తాజావార్తలు
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!