Russia Crime: దారుణం.. యువతిని 14 ఏళ్లు బంధించి, 1000 సార్లకు పైగా అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Man Kidnapped Teen Girl And Kept As His Slave For 14 Years: రష్యాలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ రాక్షసుడు యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించి.. ఆమెను బంధించి, 14 సంవత్సరాలపాటు చిత్రహింసలకు గురి చేశాడు. తన శృంగారానికి బానిసగా మార్చుకున్నాడు. 1000 సార్లకు పైగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై పైశాచికత్వం ప్రదర్శిస్తూ, నరకం చూపించాడు. చివరికి ఎలాగోలా ఆమె ఆ రాక్షసుడి చెర నుంచి బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో వ్లాదిమిర్ చెస్కిడోవ్(51) అనే వ్యక్తి 2009లో ఎకటరీనా అనే యువతిని కిడ్నాప్ చేశాడు. ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచి.. ఆమెను బయటకు రాకుండా బెడ్రూంలో నిర్బంధించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరిస్తూ, ఇంట్లో పనులు చేయించుకునేవాడు.
Aashika Bhatia: అవును.. నాకు ఆ ‘పాడు’ అలవాటు ఉంది.. అమ్మకి కూడా తెలుసు
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎకటరీనా ప్రయత్నించింది కానీ, ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆమె దీనస్థితిపై జాలి కలిగి.. వ్లాదిమిర్ తల్లి ఆమెను విడిపించడంలో సహాయం చేసింది. ఆమె సహకారంతో ఎకటరీనా ఆ నరకం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. బయటకొచ్చిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి, జరిగిన ఉదంతాన్ని వివరించింది. తనని 14 ఏళ్లు బంధించి 1000 సార్లకు పైగా అత్యాచారం చేశాడని, కత్తితో బెదిరించి ఇంట్లో పనులు చేయించుకున్నాడని, చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా హింసించేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. తనను బందించిన ఇంటికే మరో మహిళని వ్లాదిమిర్ తీసుకొచ్చాడని, తనతో గొడవ పడిన కారణంగా ఆమెను 2011లో కత్తితో అనేకసార్లు పొడిచి కిరాతకంగా చంపాడని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడు వ్లాదిమిర్ని అదుపులోకి తీసుకున్నారు.
Startup Layoffs: దయనీయమైన స్థితిలో స్టార్టప్‌లు.. 6 నెలల్లో 17 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్
అలాగే.. నిందితుడు ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ పోలీసులకు బయంకరమైన వస్తువులు కనిపించాయి. సెక్స్ టాయ్స్, శృంగార వీడియోలతో ఆ ఇళ్లు మొత్తం నిండి ఉండటం చూసి వాళ్లు ఖంగుతిన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మానవ అవశేషాలు కూడా అక్కడ కనిపించాయి. దీంతో.. అతనిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ ఆరోపణలపై కేసు నమోదు చేశాడు. వ్లాదిమిర్ మానసిక రుగ్మతతో బాధపడుతుండటంతో.. పోలీసుల సమక్షంలో ఒక మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!