Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Israel War: ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేస్తున్నాయి. గత శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని చమురు సౌకర్యాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలోకి ఇరాన్‌కు మద్దతుగా రష్యా ఎంట్రీ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా ఇరాన్‌కు నిఘా సమాచారాన్ని అందిస్తోందని, అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేయడానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపించింది. యూఎస్ యుద్ధ నౌకలు, సైనిక విమానాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలను ఇస్తోందని ది వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. ఈ యుద్ధంలో రష్యా సహకారం చాలా ఉందని పేరు వెల్లడించని అమెరికా అధికారులు చెప్పారు.
అయితే, ఈ నివేదికపై అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో కొడుతోంది. అయితే, ఈ సామర్థ్యం ఇరాన్‌కు లేదని, రష్యా వంటి హైటెక్ నిఘా సామర్థ్యంతోనే సాధ్యమవుతుందని నివేదిక చెప్పింది. ఇరాన్ వైమానిక దళాలు అధునాతన అమెరికన్ MQ-9 డ్రోన్‌ను కూల్చివేసాయి. అయితే, ఈ నివేదికపై అమెరికన్ రక్షణ దళాలు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇరాన్ యుద్ధంలో రష్యా, చైనా పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!