Site icon NTV Telugu

Ukraine-Russia: రష్యా డ్రోన్ దాడి.. సముద్రంలో ఉక్రెయిన్ భారీ నౌక పేల్చివేత

Ukrinerussia

Ukrinerussia

ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరు దేశాధి నేతలతో ఇప్పటికే ట్రంప్ శాంతి చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంతలోనే రష్యా భీకరదాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో భారీ దాడులు చేయగా.. తాజాగా సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన అది పెద్ద నౌకను డ్రోన్‌తో పేల్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే

రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్స్ నిఘా కోసం డానుబే నదిలో ఉంచిన పెద్ద నౌకను రష్యా డ్రోన్‌తో దాడి చేసి పేల్చేసింది. దీంతో భారీ విస్ఫోటనంతో పేలిపోయి ముక్కలైంది. సముద్రంపై రష్యా డ్రోన్ ప్రయోగించడం ఇదే తొలిసారి. దశాబ్ద కాలం క్రితం నుంచి ఈ నౌక ఉంటుంది. డ్రోన్ దాడిలో నౌక పేలిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నౌకలో ఉన్న ఒకరు చనిపోగా.. అనేక మంది గాయపడ్డారని ఉక్రెయిన్ నేవీ అధికారి తెలిపారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. సింఫెరోపోల్ 2019లో ప్రారంభించబడిందని.. రెండు సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ నావికాదళంలో చేరినట్లుగా చెప్పారు. 2014 నుంచి కీవ్ ప్రయోగిస్తున్న అతి పెద్ద నౌకగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!

ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మరోసారి దాడులు ఉధృతం అవుతున్నాయి. బుధవారం రాత్రి కీవ్‌ సహా పలు నగరాలపై మాస్కో 598 డ్రోన్లు, 31 క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా.. 48 మందికి గాయాలయ్యాయి.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిపారు కానీ.. ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో చర్చలు జరిపారు. షరతులు కారణంగా చర్చలు ఫలించలేదు. వెనువెంటనే జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాధినేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫలిస్తాయో లేదో ఇంకా తెలియదు.

 

Exit mobile version