NTV Telugu Site icon

Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో రష్యా దాడి..

Russia

Russia

Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెప్తున్నారు. అయితే, ఈ దాడుల సమయంలో కీవ్‌ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తునే ఉంది. కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులకు దిగింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకు వచ్చిన డ్రోన్లను పుతిన్ సైన్యం వినియోగించినట్లు తెలుస్తుంది.

Read Also: Mallikarjun Kharge : మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్‌ ఏం చేస్తోంది?.. మోడీపై ఖర్గే ఫైర్

అయితే, కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నట్లు సమాచారం. ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకర్లలోన ఉండాలని ఉక్రెయిన్‌ అధికారులు సూచించారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ యుద్ధాన్ని శాంతింపజేయడంపై నజర్ పెడతామని అతడు చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ సర్కార్ తగిన కృషి చేస్తుందని ట్రంప్ వెల్లడించారు.