Ukraine Russia War: మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. అవే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్‌బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బ తగలిందని.. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 174 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 3వేల 198 ట్యాంకులను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. అటు 29 వేలకుపైగా రష్యన్ సైనికులను హతమార్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణశాఖ. 204 యుద్ధ విమానాలు, 170 హెలికాప్టర్లు, 1285 ట్యాంకులను నాశనం చేసినట్లు వెల్లడించింది.
Read Also: Lockdown: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభణ.. కీలక నగరాల్లో లాక్‌డౌన్..
Also Read
- Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
- Explainer: సొంత దేశస్తులనే కిడ్నాప్ చేసి హింసిస్తున్న భారతీయులు.. థాయ్‌లాండ్‌లో మానవత్వం మరిచిన ఇండియన్స్!
- US Iran Talks: పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?
ఇక, యుద్ధం నాలుగోనెలలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటికీ విజేత ఎవరనేది తేలలేదు. పోరాడితే పోయేదేమీ లేదన్న తరహాలో ఉక్రెయిన్ వీలైనన్ని తంత్రాలతో దూకుడు ప్రదర్శిస్తుండగా.. రష్యా దీటుగానే బదులిస్తూ ఒక్కోనగరాన్ని వశం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయితే.. ఉక్రెయిన్ సైన్యాల గెరిల్లా యుద్దతంత్రం రష్యన్ బలగాలను బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్‌లో గెరిల్లా వార్‌ఫేర్ రష్యాకు సవాల్‌గా మారింది. అందుకే రష్యాకు ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు పట్టు దక్కలేదు.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!