ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్‌బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు…