మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలకు హైదరాబాద్ హబ్‌గా మారిందన్న ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగు దేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు.
Chandrababu: త్వరలో 1995 సీఎంను చూస్తారు.. వారికి చంద్రబాబు హెచ్చరిక
ఇప్పుడు ఉన్న సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతానికి అమరావతికి సినీ పరిశ్రమ రావడం అంత అవసరం లేదన్న ఆయన అమరావతి నిర్మాణం పూర్తయితే.. సినిమాలన్నీ ఇక ఏపీలోనే నిర్మించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు.