China’s response to Rishi Sunak’s comments: యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవిగా చైనా ఆరోపించింది. ప్రధాని మంత్రి రేసులో భాగంగా ఆయన చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందింస్తూ… ‘‘ చైనా ముప్పు’’అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యలను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కొంత మంది బ్రిటిష్ నాయకులు స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నామని జావో లిజియాన్ అన్నాడు.
సోమవారం తన ప్రచారంలో భాగంగా భారత సంతతి రిషి సునక్ మాట్లాడుతూ… చాలా కాలంగా బ్రిటన్, పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు చైనా దుర్మార్గపు కార్యకలాపాలను చూసిచూనట్లు వదిలేశారని.. వారంతా కళ్లు మూసుకున్నారని విమర్శించారు. వెస్ట్రన్ రాజకీయ నాయకులు చైనాకు రెడ్ కార్పెట్ పరిచరాని.. నేను ప్రధాన మంత్రిగా ఎన్నికైన మొదటి రోజునే దీన్ని మారుస్తానని వాగ్ధానం చేశారు. బ్రిటన్ లో చైనీస్ ప్రభుత్వం నిధులు సమకూర్చే కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లను నిషేధిస్తానని.. చైనా గుఢచర్యాన్ని ఎదుర్కోవడానికి బ్రిటన్ వ్యాపారలుకు సాయం చేయడానికి గూఢచార ఎజెన్సీలను నియమిస్తానని రిషి సునక్ హామీ ఇచ్చారు. వ్యూహాత్మకంగా సున్నితమైన సాంకేతిక సంస్థల్లో, బ్రిటిష్ ఆస్తులను చైనా కొనుగోలు చేయడాన్ని నిషేధించం విధించేలా ప్రయత్నిస్తానని అన్నారు.
Read Also: CPEC: పాక్, చైనాలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్
బోరిస్ జాన్సన్ తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో యూకేలో ప్రధాని ఎన్నిలకు అనివార్యం అయ్యాయి. వరసగా ఐదు రౌండ్లలో జరిగిన పోటీలో రిషి సునక్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే ప్రస్తుతం ప్రధాని రేసుతో రిషి సునక్ తో పాటు లిజ్ ట్రస్ ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న యూకేకు కాబోయే కొత్త ప్రధాని ఎవరనేది తెలుస్తుంది.
We urge UK politicians not to keep making unwarranted remarks about China. pic.twitter.com/3AS52kKTEe
— CHINA MFA Spokesperson 中国外交部发言人 (@MFA_China) July 25, 2022