RK Roja:లోకేష్ తీరు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని PLR కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ , భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉంది..లోకేష్ తన స్ధాయికి నుంచి మాట్లాడుతున్నాడు..ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడు… లోకేష్ కూడా అదే కావాలని కోరుకున్నట్లు ఉంది.
Read Also: Google: ఉద్యోగులను తీసేశారు.. ఇప్పుడు రోబోలను తొలగించిన గూగుల్..
Also Read
మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరగగలడా? చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయండి…లోకేష్ ఒక పిల్ల పిత్రేగాడు…మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు…దమ్ముంటే ఆధారాలతో రా లోకేష్ ..నీ పాదయాత్రకు జనాలు లేరు…కనీసం పదిమంది కూడా ఉండడం లేదు.. చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ చార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్ళది అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. లోకేష్ నావల్ల కాదని జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నాడు…
ఇది చంద్రబాబు పార్టీ కాదు …ఎన్టీఆర్ గారి పార్టీ. టిడిపిలో చంద్రబాబు, లోకేష్ దొంగబతుకు బతుకుతున్నారు. ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ బతకదుని అర్థం అయ్యింది వాళ్ళుకి..అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ భజన చేస్తున్నారు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. లోకేష్ పాదయాత్ర ఫైయిల్ అవ్వడంతో వారాహితో పవన్ కళ్యాణి ఎక్కడ హీరో అవుతాడనే భయంతొ పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారు. వెయ్యి కోట్ల ఫ్యాకేజీ అని పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు, లోకేష్ రాయించారు..ఎప్పుడూ చెప్పు చూపించే పవన్ కళ్యాణి …ఇప్పుడు ఏంచేస్తారని ప్రశ్నించారు రోజా.
Read Also: Sanitizer : చిన్నారి ప్రాణం తీసిన శానిటైజర్.. హైదరాబాదులో విషాదం
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?