Pakistan-US: పాక్ కలవరం.. అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌ తొలగింపు

  • అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌ తొలగింపు
  • పాకిస్థాన్ విజ్ఞప్తితో మ్యాప్ తొలగించిన అమెరికా
  • ఇటీవల భారత్‌‌తో డీల్ సందర్భంగా విడుదల చేసిన మ్యాప్
Pakistanus

Pakistanus

ఇటీవల భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాలు ముసాయిదా విడుదల చేశాయి. ఈ సందర్భంగా అమెరికా.. ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. అలా భారత్ మ్యాప్ విడుదల చేసిందో లేదో దాయాది దేశం పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. వెంటనే అమెరికా నాయకత్వంతో సంప్రదింపులు జరిపి మ్యాప్‌ను తొలగింపజేసింది. అమెరికా.. ఇండియా మ్యాప్‌ను తొలగించినట్లుగా పాకిస్థాన్ ప్రకటించింది. దిద్దుబాటును స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Zaima Rahman: ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!

మీడియా సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి మాట్లాడుతూ.. ఇస్లామాబాద్.. అమెరికా అధికారులను సంప్రదించి మ్యాప్‌ను తొలగించమని కోరిందని.. ఇది కాశ్మీర్‌పై దీర్ఘకాల వైఖరికి ఇబ్బందిని కలిగించిందని చెప్పారు. చట్టవిరుద్ధమని భావించిన అమెరికా వెంటనే మ్యాప్ తొలగించినట్లుగా పేర్కొన్నారు.