India map: భారతదేశ మ్యాప్‌ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తప్పుగా చూపిండటంతో విమర్శలు ఎదుర్కొంది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పుడూ ఇజ్రాయిల్‌తో నిలుస్తుంది, ఇజ్రాయిల్ భారత్‌తో ఉందా..? అని పలువురు ప్రశ్నించారు. పొరపాటుని గమనించిన రాయబార కార్యాలయం వెంటనే తప్పుగా చూపించిన మ్యాప్‌ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
MotoGP: మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన MotoGP భారత మ్యాపును తప్పగా చూపింది. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పుగా చూపింది. దీంతో MotoGP చేసిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశ భౌగోళిక రూపాన్ని అతిపెద్ద మానవహారంతో రూపొందించినందున ఈ ఈవెంట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదు చేయబడింది.
ఏపీ రాజధాని ఏది అంటే ప్రస్తుతం ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. ఇది విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా…
తాజాగా “ట్విట్టర్” మరో వివాదంలో చిక్కుకుంది. ఓ “ట్విట్టర్” యూజర్ పోస్ట్ చేసిన తప్పుడు భారత్ చిత్రపటం పట్ల తీవ్ర ఆగ్రహం, ప్రతిస్పందనలు, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లడయ్యాయి. “ట్విట్టర్” వెబ్ సైట్ లోని “ట్వీప్ లైఫ్” విభాగం లో పోస్ట్ చేసిన భారత దేశ భౌగోళిక చిత్రపటం లో జమ్మూ కాశ్మీర్, లడక్ భారత్ దేశ అంతర్భాగం కానట్లుగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఆ పోస్ట్ లో ఉంది.…