ఐదు రోజుల్లోనే మొత్తం మారిపోయింది… ఇప్పుడు ఎక్కడ చూసినా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 కి ముందు ఆ కాబూల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆగస్టు 15 తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందిరికి తెలిసిందే. ఆగస్టు 15కి ముందు కాబూల్ నగరంలో యువత చాలా మోడ్రన్‌గా కనిపించేవారు. జీన్స్, టీషర్ట్ తో పాశ్ఛాత్య సంస్కృతికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపించేవారు. 24 గంటలు ఆ నగరంలో బయట యువత సంచరించేవారు. అయితే, ఆగస్టు 15 తరువాత పూర్తిగా మారిపోయింది. పెద్ద వయసువారితో పాటుగా, యువత కూడా సాధారణ దుస్తులు ధరించి బయటకు రావడం మొదలుపెట్టారు. జీన్స్ వేసుకున్నవ్యక్తులు మచ్చుకైనా కనిపించలేదు. ఇక మహిళల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు నిండుగా బురఖా ధరించి మాత్రమే బయటకు వస్తున్నారు. కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఒంటరిగా బయటకు వచ్చారు అంటే తిరిగి ఇంటికి వస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాము గత పాలకులకు భిన్నంగా పరిపాలన సాగిస్తామని, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నా, దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువత ఆ దేశ జాతీయ జెండాను చేతపట్టి బయటకు వచ్చారు. వీరిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. అలానే, బయటకు వచ్చిన అనేక మంది మహిళలపై తాలిబన్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Read: ఐఐఎఫ్ఎం 2021 అవార్డ్స్ : ఉత్తమ నటిగా సమంత
Also Read
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
- PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను 'ప్రధాని' చేస్తాడా?
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
- Tags
- Afghanistan
- Kabul
- Taliban
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!