US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Pharma Tariff: అమెరికా తమ దేశంలోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధుల మందులు, వాటి తయారీలో వాడే కీలక పదార్థాలపై ఎలాంటి అదనపు రవాణా పన్నులు (యాడ్ వాలొరెమ్ టారిఫ్‌లు) వేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 20 దేశాలకు ఈ రాయితీ ఇస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ అధికారికంగా ఒక నోటీసు విడుదల చేసింది. సెప్టెంబర్ 29 నుంచి పేటెంట్ పొందిన కొన్ని రకాల మందుల దిగుమతులపై ఏకంగా 100 శాతం పన్ను విధించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతున్న సమయంలో ఈ నిర్ణయం రావడం విశేషం.
అసలు ఈ జీరో పర్సెంట్ టారిఫ్ దేనిదేనికి వర్తిస్తుందంటే..?
తీవ్రమైన జబ్బులకు వాడే మందులు, సంతానలేమి చికిత్సలు, సెల్ థెరపీ, జీన్ థెరపీ, యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్స్, అలాగే జంతువులకు వాడే మందులతో పాటు వీటి తయారీకి ఉపయోగించే కీలక కాంపొనెంట్లకు కూడా పన్నుల నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. ఇక్కడ ‘యాడ్ వాలొరెమ్’ పన్ను అంటే ఒక వస్తువు ధర ఆధారంగా నిర్ణయించే ఒక నిర్దిష్ట శాతం. అమెరికాతో ఇప్పటికే వర్తక, భద్రతా ఒప్పందాలు ఉన్న లేదా భవిష్యత్తులో చేసుకోబోయే దేశాలకే ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో భారతదేశంతో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, కంబోడియా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, యూరోపియన్ యూనియన్, గౌతమాలా, ఇండోనేషియా, జపాన్, జోర్డాన్, మలేషియా, నార్త్ మాసిడోనియా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్, తైవాన్, థాయ్‌లాండ్, బ్రిటన్, వియత్నాంలు ఉన్నాయి.
Also Read
- Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
దీని వెనుక అసలు కథేంటంటే..?
తమ దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ఒక కీలక ఆదేశం ఇచ్చారు. ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 232 కింద పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. ఈ పన్ను జూలై 31 నుంచే కొన్ని కంపెనీలకు అమల్లోకి రాగా, మిగిలిన సంబంధిత కంపెనీలన్నింటికీ సెప్టెంబర్ 29 నుంచి వర్తించనుంది. అయితే సాధారణంగా అందరూ వాడే జెనెరిక్ మందులకు మాత్రం ఈ 100 శాతం టారిఫ్ బాదుడు నుంచి ఊరట లభించింది. జెనెరిక్ ఫార్మా ఉత్పత్తులకు ఈ పన్నులు వర్తించవని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా పేటెంట్ లేని జంతువుల ఆరోగ్య ఉత్పత్తులను కూడా ఈ మినహాయింపు పరిధిలోకి తెస్తూ కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. ఈ నిబంధనల కింద ఫార్మా ఉత్పత్తులు అంటే కేవలం సిద్ధంగా ఉన్న మందులే కాకుండా, వాటి తయారీకి వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (API), ప్రాథమిక ముడి పదార్థాలు మాత్రమే వస్తాయని అమెరికా స్పష్టతనిచ్చింది.
తాజావార్తలు
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!