Site icon NTV Telugu

Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం

Ranil Wickramasinghe

Ranil Wickramasinghe

Ranil Wickramasinghe Says They Have Only One Option On Economic Recovery: శ్రీలంకలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం సతమతమవుతుంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. తమ ముందు ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గమని తాజాగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న విషయం తనకు తెలుసని.. అలాగే దేశం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసని ఆయన అన్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో జీవనవ్యయం భారంగా మారి, ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పులొస్తున్నాయన్నారు.

Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్‌లోనే తొలి ఆటగాడిగా..

ఈ ఆర్థిక సంక్షోభం విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేసిందని.. తద్వారా ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలను పొందలేకపోతున్నారని రణిల్ పేర్కొన్నారు. ఈ సమస్యలను గల కారణాలేంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అని చర్చించుకోవడం వ్యర్థమని.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్‌ సాయం పొందడం ఒక్కటే మార్గమని.. లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్‌వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ విషయం గురించి ఇప్పటికే జపాన్‌తో చర్చలు జరిపామని తెలిపారు. తాము చైనా, జపాన్, భారత్ నుంచి రుణ సాయం పొందామన్నారు. అటు అమెరికా, యూరప్‌లో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని.. దాని వల్ల వచ్చే ఏడాది శ్రీలంక ఎగుమతి మార్కెట్‌ పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అలా జరగకుండా ఉండాలంటే.. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

Akhilesh Yadav: గంగా విలాస్ కొత్తదేం కాదు.. 17 ఏళ్ల పాతది

ఐఎంఎఫ్ విశ్వాసాన్ని పొందేలా తమ ప్రభుత్వం విజయవంతమైన చర్చలు జరపడంలో విజయం సాధించిందని.. ఈ ఏడాది తొలి త్రైమాసిక తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని రణిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024కల్లా మెరుగైన వృద్ధి సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగాన్ని కూడా బలేపేతం చేయాలన్నారు. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాలని.. ఫలితంగా ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కాగా.. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలపై రణిల్‌ చర్చించారు.

RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..

Exit mobile version